టీవీ9 కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కర్నూలు మండలం టీవీ9 కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్