మునగాలపాడు: అర్జున్ కుటుంబానికి మంత్రి నారా లోకేష్ భరోసా

గతేడాది కర్నూలు జిల్లా నన్నూరు వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందిన టీడీపీ కార్యకర్త ఎం. అర్జున్ కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆహ్వానించి పరామర్శించారు. తల్లిదండ్రులు, సోదరితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్జున్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ బాధ్యతలను తానే తీసుకుంటానని, జీవితాంతం అండగా ఉంటానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్