నూతనపల్లె: ఎల్లమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

కర్నూలు మండలం వెంకాయపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవతా దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఆలయ ఈఓ రాధాకృష్ణ నూతన కమిటీ చైర్మన్‌గా బోగిని నాగేంద్రతో పాటు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్