పంచాలింగల: బాల్యం అమూల్య దశ.. బాల్య వివాహాలు నిర్మూలించాలి

బాల్యం అమూల్యమైన దశ అని, బాల్య వివాహాలను నిర్మూలించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో కోనేరు ఎన్. జీ. ఓ సంస్థ, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా చేపట్టిన 'బాల్య వివాహ విముక్తి భారత్' పేరుతో వంద రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బాల్య వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్