పంచలింగాల: సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎంపీ నాగరాజు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు శుక్రవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని తన నివాసంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 5. 22 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని, ప్రభుత్వం అందజేస్తున్న సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరాముడు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్