రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.