పంచలింగాల: జాతీయ టీబీ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో సోమవారం జాతీయ టీబీ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీబి వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. వైద్యులు, టీడీపీ నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్