కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో శుక్రవారం ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి, వారికి అందుతున్న పింఛన్ మొత్తం, సమయానికి అందుతుందా, ప్రభుత్వ సేవలపై అవగాహన వంటి విషయాలను ఆయన తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని, ప్రతి అర్హుడికి పింఛన్లు సమయానికి అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ తెలిపారు.