పసుపుల: రూ. 4. 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 4,12,644 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సోమవారం పంపిణీ చేశారు. పసుపుల గ్రామంలోని తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్