పసుపుల: కుక్కను తప్పించబోయి.. టీచర్ దంపతులకు తీవ్రగాయాలు

కర్నూలు మండలంలోని పసుపుల గ్రామ సమీపంలో ఉన్న జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపుల ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్ఓటీ టీచర్ ఇందిర, భర్త భాస్కర్‌తో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఒక కుక్క అడ్డుపడడంతో బైక్ అదుపుతప్పి పడిపోయారు. గాయాలైన దంపతులను 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి వారిని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్