ప్యాలకుర్తి: రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

కర్నూలు జిల్లాలో 5వ దశలో చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. సర్వే ప్రారంభానికి ముందు రైతులకు ముందస్తు నోటీసులు అందజేయడం తప్పనిసరిగా చూడాలని సూచించారు. బుధవారం కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమి సరిహద్దుల నిర్ధారణ, భూ రికార్డుల పరిశీలన, రోవర్ యంత్రాల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే బృందాలు అనుసరిస్తున్న కొలతల విధానం, సాంకేతిక పరికరాల వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్