సంగాల: ఇసుక ట్రాక్టర్ బోల్తా… డ్రైవర్ మృతి

సి. బెళగల్ మండలంలోని సంగాల సమీపంలో శనివారం రాత్రి ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ రామన్న (27) అక్కడికక్కడే మృతి చెందాడు. తిమ్మందొడ్డి వద్ద తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై వేణుగోపాల్ రాజు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు.

సంబంధిత పోస్ట్