కోడుమూరు మండలంలో యూరియా కొరత లేదని మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ శనివారం తెలిపారు. అనుగొండ, అమడగుంట్ల, ఎర్రదొడ్డి, ముడుమలగుర్తి, ప్యాలకుర్తి, వర్కూరు, పులకుర్తి, లద్దగిరి, గోరంట్ల గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలు, ఎరువుల దుకాణాల్లో యూరియా భారీగా నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. 40 టన్నుల యూరియా డీసీఎంఎస్కు చేరుకున్నట్లు తెలిపారు. రైతులు యూరియా అవసరమైనంత మాత్రాన మాత్రమే కొనుగోలు చేయాలన్నారు.