దిన్నదేవరపాడులో విషాదం.. జనసేన కార్యకర్త మురళికి నివాళి

గోవా సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మురళి భౌతిక కాయానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు నివాళులర్పించారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు సంధ్య విక్రమ్ కుమార్‌తో కలిసి మురళి భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్