పసుపుల: ప్రతిచిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఆయన పోలియో కేంద్రాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్