కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామ సమీపంలో మంగళవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అనుగొండ గ్రామానికి చెందిన నాయుడు, ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన మధు బైకులు ఢీకొనడంతో నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.