ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 13వ జిల్లా మహాసభలు మే 10, 11 తేదీల్లో కర్నూలు మండలం ఉల్చాలలో నిర్వహించనున్నట్లు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మన్ననలు పొందుతున్న సంఘం ఈ మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఓర్వకల్లు, వెల్దుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి మహాసభల ప్రాధాన్యతను వివరించారు. మే 10న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.