గురువారం కోడుమూరు-ఎమ్మిగనూరు రోడ్డులో వర్కూరు వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్న రంగన్న, భార్య ఈరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె రజితకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ కుటుంబాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోడుమూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.