వెలుగోడు మండలం వేల్పనూరులోని తన నివాసంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని, జూలై 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగనున్న గ్రామీణ వైద్య మహాసభకు శుక్రవారం ఆహ్వానించారు. గ్రామీణ వైద్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. గ్రామీణ వైద్యుల సమక్షంలో ఎమ్మెల్యేను పూలగుచ్ఛంతో సన్మానించి మహాసభలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. డాక్టర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.