కోడుమూరులో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా తీసుకెళ్తున్నాం

కోడుమూరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని, తాగునీటి అవసరాలకు రూ. 64 లక్షలు, రామచంద్రపురం గ్రామానికి రూ. 4 లక్షలు, దేవమడ ప్రాంతానికి రూ. 1.25 కోట్లు, అంబేద్కర్ నగర్ అభివృద్ధికి రూ. 2.19 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్