మంగళవారం కోడుమూరు మండల కేంద్రంలోని కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ దుకాణంలో వ్యవసాయ అధికారి ఏవో రవిప్రకాష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విత్తన విక్రయాలకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించి, దుకాణదారులకు అవసరమైన సూచనలు చేశారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన కొత్త రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని, రైతులకు వారి పొలం అవసరాలకు అనుగుణంగా మాత్రమే విత్తన ప్యాకెట్లు ఇవ్వాలని, అధిక పరిమాణంలో విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే ఒకే రకం కంపెనీ విత్తనాలపై రైతులను తప్పుదారి పట్టించరాదని, ప్రతి రోజు అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.