కుష్టు వ్యాధిపై అవగాహన అవసరం: ఎంపీడీవో

వెలుగోడు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ (ఏపీ విహెచ్ఎ) సహకారంతో స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో పి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కుష్టు వ్యాధి బ్యాక్టీరియా వల్ల చర్మం, నరాలపై ప్రభావం చూపుతుందని, వ్యాధిని గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం కాదని, దీనిపై అవగాహన చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫనుర్ మెడికల్ ఆఫీసర్లు, వైఎస్ఆర్ ప్రోగ్రాం ఖాదరవల్లి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్