కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న వేశ్యల వ్యాపారాన్ని అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, ఉపాధ్యక్షులు హుస్సేన్ బాషా సహాయ కార్యదర్శి మధు విజ్ఞప్తి చేశారు. గురువారం సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ సింహకు ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఈ ప్రాంతంలో భయపడిపోతున్నారని, వేశ్యల వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.