కర్నూలులో ప్రభుత్వ భూమిలో టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆర్ & బి ప్రభుత్వ అతిథి గృహానికి చెందిన 2 ఎకరాల స్థలంలో టీడీపీ నాయకులు భూమి పూజ చేయడం దారుణమని విమర్శించారు. ఇప్పటికే టీడీపీకి కార్యాలయం ఉన్నప్పటికీ, మరో కార్యాలయం నిర్మించేందుకు కుట్రలు చేస్తున్నారని, అక్కడ నివసిస్తున్న వారిని తరిమికొట్టి భూమి పూజ నిర్వహించడం అమానుషమని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలను కూల్చి పార్టీ కార్యాలయం నిర్మించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.