కర్నూలు రూరల్ మండలం సుంకేసుల గ్రామంలో సుంకేసుల డ్యామ్ నుంచి కేసి కెనాల్ కి నీటిని విడుదల చేశారు. ఆదివారం ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఎంపీ నాగరాజు కర్నూలును సస్యశ్యామలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రూ. 4 వేల కోట్ల రూపాయలతో వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.