ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో బుధవారం టీడీపీ మండల అధ్యక్షులు శివప్ప ఆధ్వర్యంలో ప్రధాన రహదారి పూడిక పనులు చేపట్టారు. ఆదోని నుండి దొడ్డనగేరి, జాలిమంచి, నౌలేకల్లు, మెకడోన, పెద్ద తుంబలం, కల్లుకుంట, ముచ్చిగిరి వంటి గ్రామాలకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు టీడీపీ మండల యువ నాయకులు వీరేంద్ర తెలిపారు. ఈ పనులు అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నాయి.