మంత్రాలయం: 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

కౌతాళం టౌన్‌లో వైఎస్సార్సీపీ షాక్ ఇస్తూ, ఆ పార్టీకి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం టీడీపీలోకి చేరాయి. మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జి రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో వైసీపీ శ్రేణులు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చర్యలను మెచ్చి టీడీపీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి, కౌతాళం సొసైటీ చైర్మన్ వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్