కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం.రాజు పేర్కొన్నారు. మఠాధిపతుల అనుమతితో కేటాయించిన స్థలంలో ఆసుపత్రి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని తాసిల్దార్‌కు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు.