మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామానికి చెందిన 15 ఏళ్ల బోయ మహాలింగమ్మ బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం, 6వ తరగతి వరకు చదివి కూలీ పనులు చేస్తున్న బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.