మంత్రాలయం మండలం చిలకలడోనకు చెందిన బోయలక్ష్మి (31), ఆమె కుమారుడు అమోఘవర్ధన్ (11) బుధవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త విజయుడు అప్పు విషయంలో భార్యపై కోపంతో మాట్లాడడంతో లక్ష్మి మనస్తాపానికి గురైంది. పురుగుల మందును మ్యాంగో జ్యూస్‌లో కలుపుకుని తాగి, కొడుకుకు కూడా ఇచ్చింది. లక్ష్మి మృతి చెందగా, అమోఘవర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేశామని ఎస్సై శివాంజల్ తెలిపారు.