చిన్నభూంపల్లి: భార్యను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భర్త

కోసిగి మండలంలోని చిన్నభూంపల్లి గ్రామంలో భర్త నరసింహులు బుధవారం రామలక్ష్మి (45)ని రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. కొద్దికాలంగా నరసింహులుకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఇటీవల మొహర్రం పండుగకు గ్రామానికి వచ్చి ఉన్నారు. ఈ క్రమంలో రామలక్ష్మి వంట చేస్తుండగా, నరసింహులు వెనుక నుంచి వచ్చి కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్