రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: నరవ రమాకాంతరెడ్డి

రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా పెద్దకడబూరులోని సొసైటీ ఆధ్వర్యంలో ఏవో సుచరిత సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు అవసరమైన యూరియాను కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు, టీడీపీ నేతలు ఏసేపు, మల్లికార్జున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్