రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయితీలలో గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలను డిజిటలైజ్ చేశారు. ఈ ప్రక్రియలో సుమారు 2200 మందిని కమిటీలలో ఏర్పాటు చేసి, వారి వివరాలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.