కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు బుధవారం పంపిణీ చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అవ్వాతాతలు, వితంతువులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. దేశమంతా పింఛన్ల పంపిణీపై ఏపీ వైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు.