కాలువల్లో చెత్త తొలగింపు: ఇరిగేషన్ శాఖ చర్యలు

పెద్దకడబూరు మండలంలోని మేకడోణ, నౌలేకల్ గ్రామ శివారుల్లో ఎల్లెల్సీ కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జేసీబీ ద్వారా తొలగించారు. కాలువలో ఆకులు, చెత్తాచెదారంతో నిండుకొని అపరిశుభ్రంగా మారడంతో స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎల్లెల్సీ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్