కోసిగి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక బాలిక అదృశ్యమైనట్లు శుక్రవారం ఎస్సై రమేష్ రెడ్డి తెలిపారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెల్లవారుజాము నుంచి బాలిక కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని ఎస్సై పేర్కొన్నారు.