మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి: యుటిఎఫ్

రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 50% మహిళలే ఉన్నందున, వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని యుటిఎఫ్ కోసిగి మండల ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కోసిగి మండలం జంపాపురం, సజ్జలగూడెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులతో సంతకాల సేకరణ చేపట్టారు. సంవత్సరానికి 10 రోజులు పేరంటల్ కేర్ లీవ్ మంజూరు చేయాలని, అన్ని రకాల అవసరాలకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునే అవకాశం కల్పించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్