మంత్రాలయం మండలంలోని మాలపల్లిలో ఇంటి స్థలం విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో బుధవారం వీరేష్, అతని భార్య, కుమారులు మదారీ, ఆమె కొడుకు అమీర్లపై దాడి చేశారు. ఈ ఘటనలో అమీర్ తలకు గాయాలయ్యాయి. వీరేష్ కుటుంబ సభ్యులు కర్రతో అమీర్ తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అమీర్ ని ఆసుపత్రికి తరలించారు. మదార్ బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.