పెద్దకడబూరులో జేసీబీ క్రయవిక్రయాల పేరుతో భారీ మోసం

పెద్దకడబూరు మండలంలో కంటీన్యూ ఫైనాన్స్‌పై జేసీబీలు కొనుగోలు చేసి, కంతులు కట్టి నమ్మకం పెంచిన తర్వాత తక్కువ ధరకు ఇతరులకు విక్రయించి భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చింతకుంట నీలయ్య, భార్గవ్‌ రాముడు, జింక నాగరాజుల గ్యాంగ్‌పై నిర్మలాబాయి ఫిర్యాదు మేరకు ఎస్సై నిరంజన్‌రెడ్డి దర్యాప్తు చేపట్టి, 8 జేసీబీలను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డీఎస్పీ పోలీసు బృందాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్