టీడీపీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం.. మునెప్ప

పెద్దకడబూరు మండలంలోని కంబదహాల్ గ్రామంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీతోనే బడుగు బలహీన వర్గాలకు సరియైన న్యాయం జరిగిందని టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, టీడీపీ బూత్ యూనిట్ ఇన్ చార్జ్ మురళీ, టీడీపీ నాయకులు మల్ధకల్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్