కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం కందుకూరు గ్రామం నుంచి అగసనూరు గ్రామానికి వెళ్లే రహదారిలో కడిదొడ్డి క్రాస్ వద్ద కర్నాటక మద్యం తరలిస్తున్న ఉసేని అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 576 కర్నాటక ఒరిజినల్ చాయిస్ 90 ఎంఎల్ మద్యం ప్యాకెట్లను, సుమారు రూ. 38,800 విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.