కౌతాళం మండలంలోని కుప్పగల్-ఇస్వీ రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నెంబర్ 12731 కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, హిందువుగా గుర్తించారు. అతడిని ఎవరో గుర్తించినవారు, పూర్తి వివరాలు అందించాలని రైల్వే పోలీసులు కోరారు.