కోసిగి: టీడీపీ మహానాడుకు భారీ స్పందన

తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు వేడుకలు కోసిగి పట్టణంలోని శ్రీమార్కండేయ స్వామి కళ్యాణ మండపంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో యువ నాయకులు పాలకుర్తి దివాకర్ రెడ్డి, పాలకుర్తి సత్యారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి డిజిటల్ మహానాడును ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్