మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు, కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని టీడీపీ యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి సోమవారం పరిశీలించారు. బీఎల్‌ఓ అధికారులతో మాట్లాడి, అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగిపోకుండా ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం, అర్లబండ సహకార పరపతి బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.