కోసిగిలో బుధవారం జరిగిన వర్చువల్ మహానాడు సభా ప్రాంగణంలో కందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ధోవి వీరయ్య (35) గుండెపోటుతో మృతి చెందారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొంటుండగా అస్వస్థతకు గురై కుప్పకూలిన వీరయ్యకు వైద్య సహాయం అందించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి, వీరయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.