మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో కుంబళనూరు గ్రామంలో 2018లో మాదిగ మారెప్పను కులం పేరుతో దూషించిన సత్యనారాయణ, సతీష్ కుమార్ లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. గురువారం కర్నూలు ఎస్సీ, ఎస్టీ కోర్టు వారికి 4 సంవత్సరాల జైలుశిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ కేసులో రుజువుకావడంతో ముద్దాయులకు శిక్ష పడినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు.