కర్నూలు: మరణంలోనూ వీడని బంధం

కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామంలో వృద్ధ దంపతులు వీరన్న, పార్వతమ్మ ఒకరికొకరు తోడుగా జీవించేవారు. వయస్సు, అనారోగ్యం కారణంగా వీరన్న నిన్న రాత్రి మృతి చెందారు. భర్త మరణ వార్తను తట్టుకోలేక పార్వతమ్మ కూడా బుధవారం ఉదయం మృతి చెందారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కొద్ది గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్