అమరావతి ఏపీ రాజధానిగా లోక్‌సభ ఆమోదం: టీడీపీ హర్షం

గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు మండలం, జాలవాడి గ్రామంలో ఆర్అండ్ బీ రహదారి నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, అమరావతిని ఏపీ రాజధానిగా లోక్‌సభ ఆమోదించడం హర్షనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి ఏపీ రాజధానిగా ఆమోదం పొందడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మతిభ్రమించిందని అన్నారు. టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్