మాధవరం: దర్గాకు వెళ్లిన బాలిక అదృశ్యం

మంత్రాలయం మండలంలోని రాంపురం, తుంగభద్ర గ్రామాల మధ్య ఉన్న దర్గా వద్ద గుంతకల్లు పట్టణానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు మాధవరం ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. గతనెల 18న దర్గాకు వచ్చి రాత్రి కనిపించకపోవడంతో బాలిక ఆచూకీ కోసం బంధువులు వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తండ్రి మాధవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్