మాధవరం: ప్రజల సంక్షేమమే కుటమి ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శనివారం మంత్రాలయం నియోజకవర్గం మాధవరం నివాసంలో ఆయన 42 మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 16,95,983 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, చావడి వెంకటేష్, లక్ష్మయ్య, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్